News March 2, 2025
కాకినాడ జిల్లాలో మద్యం షాపుల మూసివేత

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ సోమవారం జరగనుంది. ఏలూరులో కౌంటింగ్ జరుగుతున్నప్పటికీ కాకినాడ జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాత్రి 10 గంటలకు షాపులు మూసివేస్తారు. తిరిగి మంగళవారం షాపులు తెరవాలని ఎక్సైజ్ శాఖ నుంచి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆదేశాలు వచ్చాయని మద్యం షాపుల యజమానులు వెల్లడించారు. దీంతో జిల్లాలోని 154 మద్యం షాపులు మూతబడనున్నాయి.
Similar News
News November 22, 2025
నల్గొండ జిల్లాలో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు

ఒకవైపు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. మరోవైపు కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవనం చాలా ఖరీదైపోతుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కోడి గుడ్డు ధర రూ.8కి చేరడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. గుడ్ల ధరలు కొండెక్కినా కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.220లకు తగ్గడం విశేషం.
News November 22, 2025
ASF: అక్రమాలను కట్టడి చేసిన SP కాంతిలాల్ పాటిల్

ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీగా నితికా పంత్ నియమితులయ్యారు. గతంలో విధులు నిర్వహించిన ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గవర్నర్ ఏడీసీగా బదిలీ అయ్యారు. ఎస్పీ కాంతిలాల్ తన 5 నెలల పదవి కాలంలో అక్రమ ఇసుక, మట్కా, జూదం, నకిలీ విత్తనాలు, పీడీఎస్ బియ్యం తదితర అక్రమ వ్యాపారాలను కట్టడి చేయడంలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 72 కేసులు నమోదు చేసి 122 మందిని అరెస్టు చేశారు.
News November 22, 2025
మాక్ అసెంబ్లీ వివాదం: వైష్ణవికి మంత్రి లోకేశ్ అభయం

నంబులపూలకుంట ZPHS విద్యార్థిని వైష్ణవి కదిరి నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. అయితే, రెండో స్థానంలో ఉన్న గూటిబైలు విద్యార్థి లిఖిత్ రెడ్డిని మాక్ అసెంబ్లీకి ఎంపిక చేయడంతో వైష్ణవి తల్లిదండ్రులు ట్విటర్ వేదికగా మంత్రి లోకేశ్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి ‘డోంట్ వర్రీ వైష్ణవి. నువ్వు మాక్ అసెంబ్లీలో పాల్గొంటావు. నీకు మాట ఇస్తున్నా’ అని రిప్లై ఇచ్చారు.


