News February 21, 2025
కాకినాడ జిల్లాలో TODAY TOP NEWS

☞జగన్‌ను కలిసిన కన్నబాబు, ☞సామర్లకోట, పిఠాపురం ఆలయాలను సందర్శించిన ఎస్పీ,☞ 48 గంటల్లోనే నిందితులు అరెస్టు,☞పెద్దాపురం: ఎనిమిది మంది వీర్వోలుకు మెమోలు☞ పిఠాపురం: శానిటైజేషన్ సూపర్వైజర్‌పై వ్యక్తి దాడి, ☞తూ.గో జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు,☞పిఠాపురం: 30 ఎకరాల విస్తీర్ణంలో జనసేన ప్లీనరీ సమావేశం, ☞మీడియాకు చురకలు అంటించిన కాకినాడ ఎంపీ, ☞కాకినాడ: ఓటర్లకు ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవులు అభ్యర్థన
Similar News
News November 22, 2025
బాపట్ల: ‘ఈ అంగన్వాడీలో పనిచేసే కార్యకర్తల వేతనం పెరుగనుంది’

బాపట్ల జిల్లాలోని 16 మినీ అంగన్వాడీ కేంద్రాలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తున్నట్లు కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, ప్రీస్కూల్ విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మార్పుతో కార్యకర్తల గౌరవ వేతనం రూ.7,000 నుంచి రూ.11,500కు పెరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News November 22, 2025
బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్ష ప్రయాణమే సులువు: శుభాంశు

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు బెంగళూరు ట్రాఫిక్ చిరాకు తెప్పించింది. టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన అక్కడి ట్రాఫిక్ కష్టాలపై చమత్కరించారు. ‘బెంగళూరులోని ఈ ట్రాఫిక్‌ను దాటడం కంటే అంతరిక్షంలో ప్రయాణించడం చాలా సులువు’ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘మారతహళ్లి నుంచి ఈవెంట్‌కు రావడానికి ప్రసంగానికి కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ పట్టింది’ అని నవ్వుతూ నగర ప్రజల బాధను హైలైట్ చేశారు.
News November 22, 2025
పుంగనూరు: రూ.770కు చేరిన టమాటా

తుఫాను నేపథ్యంలో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు శనివారం 57.94 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. నాణ్యత కలిగిన టమాటా 15 కిలోల బాక్స్ రూ.770 పలికింది. రెండో రకం రూ.500, మూడో రకం రూ.300 చొప్పున కొనుగోలు చేశారు.


