News February 6, 2025
కాకినాడ జిల్లా ప్రజలకు ముఖ్య సమాచారం

గుండెపోటు వస్తే రూ.45 వేల విలువైన ఇంజెక్షన్ను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేస్తారని కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ వెల్లడించారు. సంబంధిత వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఇంజెక్షన్ దొరికే ఆసుపత్రుల వివరాలు ఇవే.
➤ తాళ్లరేవు ➤ సామర్లకోట ➤ తుని ➤ పెదపూడి
➤ ప్రత్తిపాడు ➤ ఏలేశ్వరం ➤ పెద్దాపురం
➤జగ్గంపేట ➤ పిఠాపురం ➤ రౌతులపూడి
Similar News
News December 4, 2025
ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఫేక్: పోలీసులు

TG: డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లపై 100% వరకు తగ్గింపు అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని హైదరాబాద్ సిటీ పోలీసులు Xలో స్పష్టం చేశారు. ఇప్పటివరకు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదని తెలిపారు. అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. ఎల్లప్పుడూ పోలీస్ హ్యాండిల్స్ను చెక్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా పలు రాష్ట్రాల్లో అదే రోజున లోక్ అదాలత్ నిర్వహిస్తుండడంతో ఈ ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది.
News December 4, 2025
పార్వతీపురం: హామీల కొలిక్కిపైనే ప్రజల ఆశలు

పార్వతీపురం మన్యం (D) భామిని మండలానికి ఈనెల 5న CM చంద్రబాబు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలపై ప్రస్తావిస్తారానే చర్చ కొనసాగుతోంది. పాలకొండను తిరిగి శ్రీకాకుళం జిల్లాలో విలీనంపై సాధ్యాసాధ్యాలను చర్చిస్తారని, దశాబ్దాల గిరిజనుల కల అయిన పూర్ణపాడు లాభేసు వంతెన, పార్వతీపురం పట్టణం అండర్ డ్రైనేజీల నిర్మాణాలపై మాట్లాడతారని..ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News December 4, 2025
జుట్టు త్వరగా పెరగాలంటే ఇవి తినండి

ప్రస్తుతకాలంలో పోషకాహార లోపంతో జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఆకుకూరలు, నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, చేపలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. వీటిల్లో ఉండే క్యాల్షియం, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, విటమిన్ డి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయంటున్నారు. అలాగే దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు పెరుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని చెబుతున్నారు.


