News February 6, 2025

కాకినాడ జిల్లా ప్రజలకు ముఖ్య సమాచారం

image

గుండెపోటు వస్తే రూ.45 వేల విలువైన ఇంజెక్షన్‌ను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేస్తారని కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ వెల్లడించారు. సంబంధిత వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఇంజెక్షన్ దొరికే ఆసుపత్రుల వివరాలు ఇవే.
➤ తాళ్లరేవు ➤ సామర్లకోట ➤ తుని ➤ పెదపూడి
➤ ప్రత్తిపాడు ➤ ఏలేశ్వరం ➤ పెద్దాపురం
➤జగ్గంపేట ➤ పిఠాపురం ➤ రౌతులపూడి

Similar News

News March 28, 2025

ప.గో: రెండు రోజులు జాగ్రత్త

image

రానున్న రెండు రోజులు ప.గో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెంలో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే పెంటపాడు, తణుకులో 40.6, అత్తిలి, ఆకివీడులో 40.1, ఇరగవరంలో 39.8, ఉండిలో 39.6, పెనుమంట్రలో 39.3, పెనుగొండలో 39.2, పాలకోడేరులో 39.1 డిగ్రీల ఎండ కాస్తుంది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. టోపీ, గొడుగు వాడాలి.

News March 28, 2025

చిత్తూరు: బాలికపై అత్యాచారం.. వైసీపీ నేతకు రిమాండ్

image

బాలికపై అత్యాచారం చేసిన కేసులో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు(D)కు చెందిన ఓ బాలిక కలికిరి(M)లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. ఈ ఏడాది జనవరి 25న బాలిక కనపడలేదు. YCP నేత అహ్మద్ పెద్ద కొడుకు జునేద్ అహ్మద్ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు.

News March 28, 2025

ఇంట్లో పేకాట.. విశాఖలో 11 మంది అరెస్ట్ 

image

హెచ్‌బి కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న వారిని ఎంవీపీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.22,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసు నమోదు చేశారు. నగరంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

error: Content is protected !!