News April 14, 2025

కాకినాడ జిల్లా ప్రజలకు హెచ్చరిక 

image

కాకినాడ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పిడుగులు పడే అవకాశాలు నెలకొని ఉన్నాయని సోమవారం జిల్లాలోని కాకినాడ పెదపూడి సామర్లకోట పెద్దాపురం తదితర ప్రాంతాల ప్రజల ఫోన్లకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థచే హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ హెచ్చరికలు అనేకసార్లు నిజమయ్యాయి.

Similar News

News December 15, 2025

GNT: ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

విద్యుత్ వంటి ఇంధన వనరులను పొదుపుగా వినియోగించి భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14 నుంచి 20వ వరకు జరుగుతున్న విద్యుత్ పొదుపు వారోత్సవాల ప్రచార పోస్టర్ ను సోమవారం కలెక్టరేట్‌లో తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. విద్యుత్ పొదుపుపై వారోత్సవాల్లో విస్తృతంగా అవగాహన నిర్వహించాలని చెప్పారు.

News December 15, 2025

గంజాయి నిర్మూలనకు పక్కా ప్రణాళికలు: కలెక్టర్

image

జిల్లాలో గంజాయి రవాణా నిర్మూలనకు పక్కా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి రవాణా చేయడం చాలా కష్టం అనే పరిస్థితిని తీసుకురావాలన్నారు. గ్రామాల్లో రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారు అనే దానిపై అవగాహన ఉండాలన్నారు.

News December 15, 2025

నల్గొండ జిల్లాలో ఈనాటి ముఖ్యాంశాలు

image

నల్లగొండ : మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమేజేషన్
నల్గొండ: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ కార్యదర్శిగా సాత్విక
చిట్యాల : డంపింగ్ యార్డుతో ఇబ్బందులు
నాంపల్లి : చెరువు నిండా వ్యర్థాలే
అనుముల : సాఫ్ట్వేర్ టు సర్పంచ్
దేవరకొండ : ముగిసిన మూడో విడత ప్రచారం
నకిరేకల్ : సర్పంచులకు సమస్యల స్వాగతం
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో?