News April 14, 2025
కాకినాడ జిల్లా ప్రజలకు హెచ్చరిక

కాకినాడ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పిడుగులు పడే అవకాశాలు నెలకొని ఉన్నాయని సోమవారం జిల్లాలోని కాకినాడ పెదపూడి సామర్లకోట పెద్దాపురం తదితర ప్రాంతాల ప్రజల ఫోన్లకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థచే హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ హెచ్చరికలు అనేకసార్లు నిజమయ్యాయి.
Similar News
News April 12, 2026
రాజమండ్రి రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్‌పై డెడ్ బాడీ..!

రాజమండ్రి రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై శనివారం సుమారు 64 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మృతుడు గోధుమ రంగు టీషర్ట్, డార్క్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ‘మావూరి అప్పారావు, తండ్రి వీరన్న’ అని ఉన్న ఆసుపత్రి చీటి లభించింది. ఆచూకీ తెలిసిన వారు 9440779249 నంబరును సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ వై.వి. రమణ కోరారు.
News April 12, 2026
కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి

సూర్యుడి ప్రతాపానికి KNL, NDL జిల్లాలు నిప్పుల కొలిమిలా మారాయి. శనివారం నంద్యాల(D) గోస్పాడులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆళ్లగడ్డ 42.6, దొర్నిపాడు 42.3, రుద్రవరం 42.2, నంద్యాల రూరల్ 42.1, చాగలమర్రి, పాణ్యం 42, ఉయ్యాలవాడ 41.9, బనగానపల్లె 41.8, జూపాడుబంగ్లా, పగిడ్యాల 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. కర్నూలు(D) మంత్రాలయంలో 42.7, కౌతాళం 42.2, కోడుమూరు 41.6, ఆలూరు, కల్లూరు 41.5 డిగ్రీలు నమోదయ్యాయి.
News April 12, 2026
గోదావరి దాటి పోలవరం అడవుల్లోకి పెద్దపులి

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంటూరు వద్ద పెద్దపులి గోదావరి దాటి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా వాడపల్లి, కొత్తూరు పరిసర కొండల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారి ఎస్కే వలీ ధ్రువీకరించారు. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు ఒంటరిగా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పులికి హాని తలపెట్టకుండా సమాచారం అందించాలని అధికారులు కోరారు.


