News April 12, 2025
కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ సస్పెండ్

కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కోవూరి ఆనందరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తునికి చెందిన ఓ గ్యాస్ ఏజెన్సీ ఆస్తి పేరు మార్చడానికి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ గత నెల 28న ఆనందరావు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇద్దరిని విచారించి రిజిస్ట్రార్ ఆనందరావును సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News January 3, 2026
వరి ఉత్పత్తిలో చైనాను దాటేసిన భారత్.. ఎలా సాధ్యమైందంటే?

చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ 152 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో భారత్ ప్రపంచంలోనే No.1 స్థానానికి చేరింది. చైనాను దాటేయడంలో.. తైవాన్ ఇచ్చిన పొట్టి రకం (TN1) విత్తనాలు మన సాగును మలుపు తిప్పాయి. వీటికి తోడు IR-8, మన దేశీ రకం ‘జయ’ రాకతో ఉత్పత్తి భారీగా పెరిగింది. ఈ రకాలు నీటి ఎద్దడిని తట్టుకుని నిలబడగలిగాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలకు రైతుల కష్టం తోడవ్వడంతో భారత్ ‘రైస్ కింగ్’గా అవతరించింది.
News January 3, 2026
కామారెడ్డి: వేడెక్కిన ‘మున్సిపోల్’

కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాథమికంగా ఓటర్ల లిస్ట్ విడుదల చేసిన అధికారులు అభ్యంతరాలకు గడువు విధించారు. ఈ నెల 10న జిల్లా అధికారులు తుది ఓటర్ల జాబితా ప్రకటించనుండగా పోటీచేసే అభ్యర్థులు ఆయా వార్డుల్లో తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయో, లేదోనని వేచి చూస్తున్నారు. దీంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది.
News January 3, 2026
వికారాబాద్: అక్కడ 365 రోజులు సంక్రాంతి!

సాధారణంగా సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు ఇంటి ముందు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెడుతారు. కానీ, ఆ ప్రాంతానికి వెళితే 365 రోజులు సంక్రాంతిలా అనిపిస్తోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ తండా ప్రజలు ప్రతిరోజు తమ ఇంటి ముందు ముగ్గు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మపై పువ్వు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరం మొత్తం ఇలా చేయడం ఈ తండా వాసుల ప్రత్యేకత. ఏళ్ల ఆచారాన్ని ఇలా కొనసాగిస్తున్నారు.


