News February 12, 2025

కాకినాడ జిల్లా వాసులకు ALERT

image

కాకినాడ జిల్లా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతి మండలానికి రెండు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా పశువర్ధక శాఖ ప్రకటించింది. మంగళవారం మొత్తం 42 బృందాలు జిల్లా వ్యాప్తంగా పరిశీలించాయి. 82 ఫారాలలో 62 లక్షల కోళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడైనా కోళ్ల మరణాలు జరిగితే వెంటనే అధికారులు తెలియజేయాలని ఆదేశాలిచ్చింది.

Similar News

News March 26, 2025

BREAKING: పంజాబ్ విజయం

image

గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో పంజాబ్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో GT ప్లేయర్లు తడబడ్డారు. సాయిసుదర్శన్(74), బట్లర్(54), రూథర్‌ఫోర్డ్ (46) ఫర్వాలేదనిపించినా చివర్లో చేయాల్సిన రన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో GT 20 ఓవర్లలో 232/5 స్కోరుకే పరిమితమైంది.

News March 26, 2025

VKB జిల్లాలో నేటి TOP NEWS..!

image

✔ VKB: ఇంగ్లిష్ పరీక్షకు 61 మంది డుమ్మా..! ✔ఎమ్మెల్యేపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: స్పీకర్ ✔VKB:బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు ✔VKB: GPO పోస్టులకు ఈనెల 26, 27న అవగాహన ✔పరిగిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు ✔ తాండూరు పుర సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ✔ పలుచోట్ల ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు ✔VKB జిల్లాలో గ్రామాల పేర్ల మార్పుకు సిద్ధం: మంత్రి సీతక్క ✔కేబినెట్ విస్తరణ.. VKBకు NO ఛాన్స్?.

News March 26, 2025

రాత్రి చపాతి తింటున్నారా?

image

బరువు తగ్గడానికి చాలామంది రోజూ రాత్రి చపాతి తింటారు. దీని వల్ల లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. రాత్రుళ్లు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. చపాతిలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అరగడానికి టైం తీసుకుంటాయి. దీంతో ఇంకోసారి తినాలని అనిపించదు. ఫలితంగా జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. అలాగే, గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల చక్కెర నిల్వలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని ఎక్కువగా చపాతీలు తినడం సరికాదు.

error: Content is protected !!