News April 11, 2025

కాకినాడ జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

కాకినాడ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 56 పరీక్షా కేంద్రాల్లో 44,531 మంది పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 22,656 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 21,871 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News December 6, 2025

NTR: SSC నామినల్ రోల్స్ ఎడిట్ ఆప్షన్

image

యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌లో SSC నామినల్ రోల్‌ విద్యార్థుల పరీక్ష వివరాల సవరణ కోసం ఎడిట్ ఆప్షన్ డిసెంబర్ 6న అందుబాటులోకి వచ్చిందని ఉప విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్‌రావు తెలిపారు. సబ్జెక్టులు, సీడబ్ల్యూఎస్‌ఎన్ స్థితి, ఫోటోలు, సంతకం వంటి లోపాలను సరిచేయాలని ఆయన సూచించారు. యూడైస్‌ ప్లస్‌లో చేసిన మార్పులు 24 గంటల్లో బీఎస్‌ఈ పోర్టల్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయని స్పష్టం చేశారు.

News December 6, 2025

దంపతులకు దత్తత ఫైనల్ ఆర్డర్ అందజేసిన కలెక్టర్

image

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఫ్రీ అడాప్షన్ పోర్టల్ ద్వారా 8నెలల చరణ్ బాబుకు తుది దత్తత ఆర్డర్‌ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అందజేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులకు ఈబిడ్డను దత్తత ఇచ్చారు. బాబును చూసుకునే విధానం, పోషణ, ఇమ్యునైజేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, దత్తత తీసుకున్న వారిని సొంత తల్లిదండ్రులుగా గుర్తించి ఫైనల్ ఆర్డర్ ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

News December 6, 2025

MBBS ప్రవేశాల్లో బాలికలదే పైచేయి: మంత్రి

image

AP: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి GOVT, PVT వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాలు ముగిశాయి. ఇందులో 60.72% అడ్మిషన్లు అమ్మాయిలే పొందినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే వీరి ప్రవేశాలు 3.66% పెరిగాయన్నారు. 2023-24లో 57.06%, 2024-25లో 57.96%, 2025-26లో 60.72% మంది అమ్మాయిలు సీట్లు పొందారని చెప్పారు. స్కూల్ దశ నుంచే ప్రణాళికతో చదువుతూ ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు.