News April 11, 2025

కాకినాడ జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

కాకినాడ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 56 పరీక్షా కేంద్రాల్లో 44,531 మంది పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 22,656 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 21,871 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News April 17, 2026

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం

image

చట్టసభల్లో మహిళలకు 33% కోటాను కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 16ను చట్టం అమలు తేదీగా ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2029లో అమలు చేసేందుకు సంబంధించి ఇదే చట్టాన్ని సవరించాలని పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే నోటిఫై చేయడం గమనార్హం. సాంకేతిక కారణాల వల్లే ఇలా చేసినట్లు ఓ అధికారి చెప్పారు. ఇదో విచిత్రమైన చర్య అని కాంగ్రెస్ మండిపడింది.

News April 17, 2026

ఇచ్చేయండి సార్.. షరీఫ్‌కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్‌లో తీర్మానం!

image

‘నోబెల్’ విషయంలో ట్రంప్‌కు పాక్ పోటీ ఇస్తోంది. తమ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌కు పీస్ ప్రైజ్ ఇవ్వాలన్న మీడియా <<19605334>>ప్రచారానికి<<>> పంజాబ్ అసెంబ్లీ వంతపాడింది. యుద్ధం ఆపేందుకు చేసిన ప్రయత్నాలకు వారికి ఇవ్వాల్సిందేనని తీర్మానం చేసింది. పాక్‌లో జరిగిన చర్చలు ఫలించలేదు. కానీ ట్రంప్ తాను <<19668983>>10వ వార్<<>> ఆపబోతున్నానని మళ్లీ నోబెల్ రేసులోకొచ్చారు. మరి పాక్ కథ ట్రంప్ చెవిన పడిందో లేదో!

News April 17, 2026

3,106 చెరువుల్లో ఉపాధి పనులు: చిత్తూరు కలెక్టర్

image

‘జలధార-నీటి భద్రత’ పనులతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 3,106 చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వలు పెంపు, సాగునీటి బలోపేతం, కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్‌కు 3 చెరువులు కేటాయించి, అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.