News March 23, 2025

కాకినాడ జీజీహెచ్‌ను వదలని జీబీఎస్ కేసులు

image

కాకినాడ ప్రభుత్వాసుపత్రిని జీబీఎస్ కేసులు వదలడం లేదు. ఇప్పటివరకు 9మందికి పైగా గిలియన్ బారే సిండ్రోమ్ బాధితులు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. శనివారం ఇద్దరు పేషెంట్లు కొత్తగా చేరారు. ప్రస్తుతం ఐదుగురు పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్యకుమారి తెలిపారు. జ్వరం, శ్వాసకోశ సమస్యలు బలహీనత తదితర అంశాలతో బాధపడేవారు జీజీహెచ్‌కు రావాలని ఆమె సూచించారు.

Similar News

News January 7, 2026

చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట

image

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికి పుష్పగుచ్ఛాన్ని అందించారు. కాగా ఢిల్లీలో ఉన్న మాగుంట ఈనెల 9న ఒంగోలుకు రానున్నారు. 9, 10న స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10న ఒంగోలు పీవీఆర్ బాలుర మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు.

News January 7, 2026

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిధులు, పెండింగ్ అంశాలు, అమరావతి శాశ్వత రాజధాని బిల్లుపైనా చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పెట్టే అవకాశం ఉంది.

News January 7, 2026

NRPT: పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు

image

వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ప్రజల ప్రాణాలు, భద్రత నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. గూడ్స్ వాహనాల్లో ప్రజలను తరలించారాదని సూచించారు.