News March 9, 2025
కాకినాడ: తల్లితో స్కూటర్‌పై 92వేల కి.మీ. ప్రయాణం

బెంగుళూరుకు చెందిన కృష్ణకుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతని తండ్రి దక్షిణామూర్తి మృతి చెందడంతో తల్లి ఒంటరితనం చూసి ఉద్యోగం వదిలి మైసూర్ వచ్చేశారు. తీర్థయాత్రలు చేయాలన్న తల్లి కోరికను కొడుకు తీరుస్తున్నాడు. తన తండ్రి కొన్న స్కూటర్‌పై పర్యటనలు ప్రారంభించారు. ఇప్పటివరకు 92 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. శనివారం కాకినాడలోని ఆలయాలు సందర్శించారు. తల్లి కోసం చేస్తున్న పనిని చూసి అతడిని పలువురు అభినందించారు.
Similar News
News November 9, 2025
కడప: వివాదంగా మారిన టీచర్లు టూర్

మైదుకూరు మండలం నంద్యాలం పేట కాంప్లెక్స్ పరిధిలోని 20మంది టీచర్లు ఒకేసారి సెలవు పెట్టి టూర్‌కు వెళ్లారు. ఒకే టీచర్ ఉన్న స్కూళ్ల నుంచి సైతం సెలవు పెట్టడం వివాదాస్పదమైంది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండో శనివారం లీవ్ ఉంటుందని టీచర్లు ముందుగానే టూర్ ప్లాన్ చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆ లీవ్ రద్దు చేశారు. టూర్ క్యాన్సిల్ చేసుకోలేక అందరూ వెళ్లారు.
News November 9, 2025
సీఎం చేతికి తిరువూరు నివేదిక.. చంద్రబాబు ఏమన్నారంటే..!

విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ల వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబుకు నివేదిక, పెన్ డ్రైవ్‌ను అందించారు. నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ పంచాయితీపై తన వద్ద కూడా సమగ్ర నివేదిక ఉందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. త్వరలో ఇద్దరు నేతలను పిలిపించి మాట్లాడతానని ఆయన వెల్లడించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
News November 9, 2025
ఒలింపిక్స్ 2028: IND vs PAK మ్యాచ్ లేనట్లే!

2028 నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానున్న సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నీలు అనగానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండాల్సిందే. కానీ ఈ ఈవెంట్లో ఇరు జట్లు తలపడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కడం కష్టంగా మారడమే దీనికి కారణం. ఒక్కో ఖండం నుంచి ఒక్కో <<18233382>>జట్టును<<>> ఎంపిక చేయాలని ఐసీసీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.


