News December 29, 2024
కాకినాడ: తాబేళ్ల మరణంపై విచారణకు ఆదేశించిన Dy.CM
కాకినాడ బీచ్ రోడ్, APIIC వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న విషయం డిప్యూటీ సీఎం Pawan Kalyan దృష్టికి వచ్చింది. రిడ్లీ తాబేళ్ల మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చిరంజీవి చౌదరిని ఆయన ఆదేశించారు.
Similar News
News January 18, 2025
కోరుకొండ నారసింహుని ఆలయంలో మద్యం, మాంసం
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండ నారసింహుని ఆలయం ప్రాంగణంలో మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి చర్యలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వ్యవహారం బయట వారి పనా.. లేక ఆఫీస్ సిబ్బంది పనా అంటూ ఉన్నతాధికారులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.
News January 18, 2025
తూ.గో జిల్లాకు చివరి ర్యాంక్
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో తూ.గో జిల్లా మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో వారి పనితీరు, పథకాల అమలు తదితర అంశాలపై ర్యాంకులు ఇచ్చినట్లు సమాచారం. అందులో ఉమ్మడి తూ.గో జిల్లా మంత్రులు, ఎంపీల పనితీరుకు చివరి ర్యాంకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం.
News January 17, 2025
తూ.గో : బరువెక్కిన గుండెతో పయనం
తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు సంక్రాంతి పండుగ ముగించుకుని పట్టణాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పండుగ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పుడే పండుగ ముగిసిందా అన్నట్లుగా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పట్టణాలకు వెళ్తున్నారు. ఈసంక్రాంతి సంబరాలను రాబోయే పండగ వరకు నెమరువేసుకుంటూ సంతోషిస్తామని పలువురు ప్రయాణికులు తెలిపారు. పిండి వంటలతో పట్టణాలకు పయనమయ్యేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.