News February 7, 2025
కాకినాడ నుంచి కుంభమేళకు మరో రైలు
కాకినాడ నుంచి ప్రయాగరాజ్కు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఫిబ్రవరి 20న కాకినాడ నుంచి ఏసీ బోగీలతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన విషయం విధితమే. తాజాగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ సూచన మేరకు ఈనెల 8న మరో అదనపు రైలు ఏర్పాటు చేశారు. ఈ రైలు కాకినాడలో 8వ తేదీ మధ్యాహ్నం 2.30కు బయలుదేరుతుందని, రెండు రోజుల తర్వాత ప్రయాగరాజ్ చేరుకుంటుందని ఎంపీ కార్యాలయం వెల్లడించింది.
Similar News
News February 7, 2025
సీఎం రేవంత్పై WEF ప్రశంసల జల్లు
TG: CM రేవంత్ రెడ్డిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి విషయంలో ఆయన దార్శనికత అద్భుతమని పేర్కొంటూ ఓ లేఖ రాసింది. ‘రాష్ట్ర అభివృద్ధికోసం మీ ప్రణాళికలు బాగున్నాయి. దావోస్ సదస్సులో మీరు కీలక భాగస్వామిగా వ్యవహరించారు. రైజింగ్ తెలంగాణ 2050 నినాదం ప్రత్యేకంగా నిలిచింది. 2047 కల్లా హైదరాబాద్ను కాలుష్యంలో నెట్ జీరో చేయాలన్న మీ సంకల్పం ప్రశంసనీయం’ అని కొనియాడింది.
News February 7, 2025
VZM: మన మంత్రికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?
అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి గజపతినగరం MLAగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు క్యాబినేట్లో MSME., సెర్ప్, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా కొండపల్లి మూడో ర్యాంకు సాధించారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20, సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. మరి కొండపల్లి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?
News February 7, 2025
దొనకొండ: ‘ప్రేమించకపోతే యాసిడ్ పోస్తా’
ముఖంపై నీళ్లు పోశాడు.. ప్రేమించకపోతే యాసిడ్ కూడా ఇలానే పోస్తానని టీచర్ను ఓ వ్యాపారి బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్శిలో ఉంటున్న ఉపాధ్యాయురాలు దగ్గరలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇంతకుముందు దొనకొండలో నివాసం ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన బంగారపు వ్యాపారితో పరిచయం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న అతను నిత్యం వేధిస్తున్నట్లు ఈ నెల 3న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.