News April 7, 2025
కాకినాడ: నేటి నుంచి వైద్య సేవలకు బ్రేక్

కాకినాడ జిల్లాలో సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య (ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్య శ్రీ అసోసియేషన్ ఆదివారం వెల్లడించింది. ప్రభుత్వం రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో అన్ని ఆసుపత్రుల్లో 3,257 వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. దీనిపై ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చించేందుకు చర్యలు తీసుకుంటుందని రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 14, 2025
కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.
News December 14, 2025
అనంతపురం: ‘1100 నంబర్కు కాల్ చేయొచ్చు’

పీజీఆర్ఎస్లో సమర్పించిన అర్జీలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు.
News December 14, 2025
డిసెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

✤ 1799: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మరణం
✤1924: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ జననం
✤ 1978: నటి సమీరా రెడ్డి జననం
✤ 1982: దక్షిణాది నటుడు ఆది పినిశెట్టి జననం
✤ 1984: నటుడు రానా జననం(ఫొటోలో)
✤ 2014: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పీజే శర్మ మరణం
✤ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
✤ అంతర్జాతీయ కోతుల దినోత్సవం


