News April 11, 2025
కాకినాడ: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

కాకినాడ జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి. NOTE: పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద ఉండకండి.
Similar News
News December 10, 2025
పెంబి: తెప్పపై తరలివెళ్లిన ఎన్నికల సిబ్బంది

ఈ నెల 11న నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మసరత్ ఖానం పెంబి మండలాన్ని సందర్శించారు. సిబ్బంది ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు తరలివెళ్లారు. యాపాల్ గూడకు వెళ్లాల్సిన సిబ్బందిని గ్రామంలోని నది వద్ద తెప్పపై సామగ్రితో దగ్గరుండి తరలించారు.
News December 10, 2025
మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.?

కృత్తివెన్ను మండలం అడ్డపర్రకు చెందిన ఓ మహిళ (55) స్క్రబ్ టైఫస్ అనుమానిత లక్షణాలతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. జ్వరం, శరీర నొప్పులతో ఆసుపత్రికి తరలించగా, పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఉన్నట్లు సమాచారం. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
News December 10, 2025
మరోసారి ఇండిగో విమానాల రద్దు

ఇండిగో విమానాల రద్దు మళ్లీ మొదలైంది. ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 300 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 137, ముంబైలో 21, బెంగళూరులో 61 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి బయల్దేరాల్సిన 70 విమానాలు కూడా రద్దయినట్లు తెలుస్తోంది. తీవ్ర సంక్షోభం తర్వాత తమ ఫ్లైట్స్ సర్వీసెస్ సాధారణ స్థితికి చేరాయని నిన్న ఇండిగో సీఈవో పీటర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరోసారి విమాన సర్వీసులు రద్దయ్యాయి.


