News March 3, 2025

కాకినాడ: నేడే కౌంటింగ్.. జిల్లాలో ఉత్కంఠ

image

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల లెక్కింపు నేడు జరగనుంది. 35 మంది అభ్యర్థులు పోటీ చేయగా 27న జరిగిన పోలింగ్‌లో 63.26% ఓటింగ్ నమోదైంది. సోమవారం ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్‌లను ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మరి కొన్నిగంటల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ వీడనుంది.

Similar News

News December 19, 2025

రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం!

image

ప్రతిపక్షాల నిరసనల నడుమ రాజ్యసభలో VB-G RAM G బిల్లు ఆమోదం పొందింది. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష MPలు వాకౌట్ చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను కాంగ్రెస్ అగౌరపరుస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఈ చట్టాన్ని BJP వెనక్కి తీసుకొనే రోజు వస్తుందని మల్లికార్జున ఖర్గే చెప్పారు.

News December 19, 2025

ముగిసిన ప్రత్యేక పాలన.. పల్లెలకు కొత్త సారధులు

image

నల్గొండ జిల్లాలో 22 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈనెల 22న నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 869 గ్రామ పంచాయతీలకు గాను, మూడు మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది.

News December 19, 2025

జీవితఖైదు వేసే అధికారం సెషన్స్ కోర్టుకు లేదు: సుప్రీం కోర్టు

image

జీవితఖైదు శిక్ష విధించే అధికారం కేవలం రాజ్యాంగబద్ధ కోర్టులకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ విధించడం, కోర్టులు వేసిన శిక్ష తగ్గించే అధికారాలు సెషన్ కోర్టులకు లేవని జస్టిస్ అహ్సానుద్దిన్ అమానుల్లా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల బెంచ్ చెప్పింది. లైంగిక కోరిక తీర్చడానికి నిరాకరించడంతో మహిళకు నిప్పంటించి చంపేసిన కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది.