News May 21, 2024

కాకినాడ: పరీక్షల్లో ఫెయిల్.. బీటెక్ విద్యార్థి మృతి

image

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. చేబ్రోలు ఆదర్శ్ ఇంజినీరింగ్‌ కళాశాలలో కోనేటి రాజా నరేంద్ర(21) బీటెక్‌ సీఎస్‌ఈ విభాగంలో థర్డ్‌ఈయర్ చదువుతున్నాడు. కాగా మొదటి రెండు సంవత్సరాలు ఇంజినీరింగ్‌ పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో ఈ నెల 4న కళాశాల వెనుక ఉన్న జీడిమామిడి తోటలో పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.

Similar News

News December 7, 2024

ఈ నెల 10 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు: తూ.గో కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ నుంచి ఆమె శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.  గ్రామాలలో భూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

News December 6, 2024

కాకినాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 14 మందికి జైలు శిక్ష

image

కాకినాడలో 42 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. నిందితులను కాకినాడ మూడో స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జి వి.‌నరసింహారావు ముందు హాజరుపరిచారు. వారిలో 14 మందికి రెండు రోజుల చొప్పున జైలు‌ శిక్ష పడింది. 28 మందికి రూ.10 వేలు చొప్పున రూ.2,80,000 జరిమానా వేశారు.

News December 6, 2024

ఇప్పుడు అంతటా కాకినాడే హాట్ టాపిక్

image

రాష్ట్రవ్యాప్తంగా కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా విషయం సంచలనం రేపుతోంది. సెజ్ భూములు, రేషన్ బియ్యం రవాణా, పోర్టు యజమానిపై బెదిరింపుల వంటి అంశాలు రోజుకు ఒకటి వెలుగుచూస్తున్నాయి. అక్రమ రేషన్ బియ్యం పేరుతో వేల కోట్ల రూపాయలు పలువురు నేతలు దోచేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డీప్ వాటర్ పోర్టు, సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.