News March 11, 2025
కాకినాడ పర్యటనకు విచ్చేసిన మాజీ జస్టిస్ ఎన్.వీ రమణ

భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ జీ.బిందు మాధవ్, జిల్లా నాల్గవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ నిరుపమ పుష్పగుచ్ఛాలు అందించి ఆయనకు సాదర స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 9.గంటలకు ఆయన అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని అధికారులు తెలిపారు.
Similar News
News November 27, 2025
ములుగు: పంచాయతీ పోరులో తాజా ‘మాజీ’లు

ములుగు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాజా మాజీ సర్పంచులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో గతంలో కాంగ్రెస్ మద్ధతు దారులుగా గెలుపొందిన వారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సర్పంచులుగా గెలిచి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని అంటున్నారు. రిజర్వేషన్ కలిసి రానిచోట ఆత్మీయులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
News November 27, 2025
ASF: అండర్ – 14 బాక్సింగ్కి 8 మంది విద్యార్థుల ఎంపిక

ఆసిఫాబాద్ జిల్లాలో అండర్–14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాక్సింగ్ సెలక్షన్స్ నిర్వహించి జోనల్ స్థాయికి 8 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. షేక్ అబ్దుల్ అజాం, విక్రం తేజ, వివేక్, ప్రేమ్ రక్షిత్, అశ్విత్ తేజ, సిద్దు, చక్రపాణి, వినయ్ ఎంపికయ్యారు. విద్యార్థులను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
News November 27, 2025
విమానం ఆలస్యం.. సిరాజ్ ఆగ్రహం

గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంపై టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 7.25 బయల్దేరాల్సిన ఫ్లైట్ 4 గంటలకు పైగా ఆలస్యం అయిందన్నారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో ఎయిర్లైన్స్ అప్డేట్ ఇవ్వలేదని, ఆలస్యానికి కారణం కూడా చెప్పలేదని ఆయన మండిపడ్డారు. తనకిది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని అసహనం వ్యక్తం చేశారు.


