News March 24, 2025
కాకినాడ: పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి

పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 27న ఉపసర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మండల ఈవోపీఆర్డీ ఆయా గ్రామ ఉపసర్పంచ్ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా విధులు నిర్వహిస్తారు. కాకినాడ జిల్లాలో పెదపాడు మండలం రామేశ్వరం, తుని పరిధిలో దొండవాక, సామర్లకోట మండలం బి.వేమవరం, తొండంగి మండలం పైడికొండ, ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి పంచాయతీల పరిధిలో ఉపసర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి.
Similar News
News December 7, 2025
మీ ఇంట్లో ఏడు గుర్రాల చిత్ర పటం ఉందా?

పరిగెడుతున్న 7 గుర్రాల చిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉత్తర దిశలో ఉంచితే సిరి సంపదలకు లోటుండదని, దక్షిణ దిశలో ఉంచితే చేసే పనుల్లో విజయం లభిస్తుందని అంటున్నారు. ‘ఈ చిత్రం శ్రేయస్సు, విజయాన్ని సూచిస్తుంది. దీన్ని పూజా మందిరంలోనే పెట్టాల్సిన అవసరం లేదు. సూర్య భగవానుడి వాహనం అయిన రథాన్ని ఈ తెలుపు గుర్రాలే లాగుతాయి’ అని వివరిస్తున్నారు.
News December 7, 2025
కల్వకుర్తి: ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శనివారం సాయంత్రం కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ప్రజాప్రతినిధులు సహా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై మాధవ రెడ్డి సూచించారు. వాహనాల తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
News December 7, 2025
ఫ్లోర్ బాల్ అనంతపురం జిల్లా జట్టు ఇదే..!

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు సిద్ధమైంది. ఇవాళ నరసరావుపేటలో జరగనున్న 19వ సీనియర్ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో అనంతపురం జిల్లా జట్టు పాల్గొంటుందని జిల్లా సెక్రటరీ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.


