News November 30, 2024
కాకినాడ: పవన్ ఆగ్రహం.. అధికారులపై యంత్రాంగం చర్యలు

పీడీఎస్ రైస్ అక్రమ తరలింపు అంశంపై కాకినాడ జిల్లా డీఎస్ఓ ఎంవీ ప్రసాద్‌పై రాష్ట్ర యంత్రాంగం చర్యలు తీసుకుంది. కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలు చేయగా అక్రమ రవాణాపై ఆగ్రహించారు. అనంతరం యంత్రాంగం కొంతమంది అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఎంవీ ప్రసాద్‌ను పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఎస్ఓగా లక్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించారు.
Similar News
News December 16, 2025
విద్యుత్.. అమూల్య సంపద: కలెక్టర్

జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా రాజమండ్రి కలెక్టరేట్‌లో మంగళవారం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్‌ను కేవలం ప్రకృతి వనరుగా కాకుండా, అమూల్యమైన సంపదగా భావించాలని ప్రజలకు ఆమె హితవు పలికారు. అవసరమైన మేరకే వినియోగిస్తూ, ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News December 16, 2025
గోపాలపురం: వెంటాడుతూనే వున్న పెద్దపులి భయం

గోపాలపురం మండలం భీమోలు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి ఆచూకీ కోసం కొండ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కెమెరాల్లో పులి జాడలు లభించలేదని డీఎఫ్‌ఓ దావీదు రాజు సోమవారం తెలిపారు. పులి ఇంకా పరిసరాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
News December 15, 2025
రాజమండ్రి: పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 23 అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.


