News March 4, 2025

కాకినాడ: పార్సిల్ కార్యాలయాలపై పోలీసు దాడులు

image

కాకినాడలోని బాలాజీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని పార్సిల్ కార్యాలయాలలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం వెల్లడించింది. అనుమానిత పార్సిల్ ఉంటే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.

Similar News

News November 18, 2025

HYD: NIMSలో అడ్వాన్స్ టెస్టింగ్

image

పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగశాలని ఆధునికీకరించి రియల్‌ టైమ్ పీసీఆర్, ఎలిజా, మైక్రో బయాలజికల్ పద్ధతులతో పరీక్షలు చేస్తున్నారు. వైరాలజీ ల్యాబ్‌లో కరోనా, హెపటైటిస్, డెంగ్యూ, ఇన్‌ఫ్లుయెన్జా వంటి వైరస్‌లపై పరిశోధనలు నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు.

రూమ్ బుకింగ్ పేరుతో రూ. 18 లక్షలు దోచేశారు..!

image

రూమ్స్ బుక్ చేస్తే పెట్టుబడికి డబుల్ ఆదాయం వస్తుందని రాజమండ్రికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫణికుమార్ ఇన్‌స్టాగ్రామ్‌‌కు ఓ లింక్ వచ్చింది. లింక్‌ను ఓపెన్ చేసి తొలుత తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి డబుల్ లాభం పొందాడు. దీంతో నమ్మకం కలిగి, రూ. 18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు.