News March 3, 2025
కాకినాడ: పార్సిల్ కార్యాలయాలపై పోలీసు దాడులు

కాకినాడలోని బాలాజీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని పార్సిల్ కార్యాలయాలలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం వెల్లడించింది. అనుమానిత పార్సిల్ ఉంటే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.
Similar News
News March 15, 2025
VZM: ‘ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి’

విజయనగరంలోని GST కార్యాలయాన్ని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పన్ను వసూళ్లపై చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ పెంపుపై కొన్ని మార్గదర్శకాలను ఆయన అందజేశారు. మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వానికి రావలసిన రెగ్యులర్ రిటర్న్, బకాయి పన్నుల వసూలు చేయాలన్నారు.
News March 15, 2025
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాం: మంత్రి ఉత్తమ్

TG: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి (RLIP) కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది తమ సర్కారు సాధించిన విజయమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి RLIP నిర్మాణం చేపట్టిందని కేంద్రం వద్ద తాను వాదనలు వినిపించానని చెప్పారు. దీన్ని అడ్డుకోకుండా ఉండి ఉంటే కృష్ణా పరివాహకంలో దుర్భర పరిస్థితి ఏర్పడేదన్నారు.
News March 15, 2025
శ్రీ సత్యసాయి: ఇంటర్ పరీక్షలకు 218 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-3 ప్రశ్నాపత్రం ద్వారా పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈవో రఘునాథ్ రెడ్డి శనివారం తెలిపారు. జనరల్ విద్యార్థుల్లో 9,057 మందికి గాను 8,877 మంది, ఒకేషనల్ విద్యార్థులలో 785 మంది విద్యార్థులకు గాను 747 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. మొత్తం 218 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.