News February 26, 2025

కాకినాడ: పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల- కలెక్టర్

image

రేపు జరిగే తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాకినాడ జిల్లాలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ జాబితాను బుధవారం కలెక్టర్ షణ్మోహన్ సగిలి విడుదల చేశారు. కాకినాడ జిల్లాలో ఎన్నికల నిమిత్తం మొత్తం 98 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ స్టేషన్ నంబర్‌, పోలింగ్ స్టేషన్ ప్రాంత వివరాలు వెల్లడించారు. 

Similar News

News March 19, 2025

పోతురాజు కాలువ పనుల్లో అవినీతి: MLA దామచర్ల

image

ఒంగోలులో ఉన్న పోతురాజు కాలువ, నల్ల కాలువ సమస్యలపైన గతంలో పోతురాజు కాలువలో జరిగిన అవినీతిని, అసెంబ్లీలో MLA దామచర్ల జనార్దన్‌రావు ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. పోతురాజు కాలువ ఆధునీకరణలో అవినీతి జరిగిందని MLA సభ దృష్టికి దృష్టికి తెచ్చారని తెలిపారు. దీనిపై ఇరిగేషన్ శాఖ నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకొని అవినీతి చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

News March 19, 2025

భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్

image

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం పలికారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదని, బ్లాక్ బస్టర్ అని రాసుకొచ్చారు. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలని ఆకాంక్షించారు.

News March 19, 2025

టేకుమట్ల: రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత

image

టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన సొల్లేటి రాములు ప్రమాదవశాత్తు గతేడాది వాగులో పడి మృతి చెందాడు. కాగా పోస్ట్ ఆఫీసులో ప్రమాద బీమా చేయించుకున్న రాములు కుటుంబ సభ్యులకు మంగళవారం పోస్టల్ సూపరింటెండెంట్ హనుమంతు, రామకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ శైలజ, ఎంపీడీవో అనిత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీశ్ చేతుల మీదుగా రూ.10 లక్షల బీమా చెక్కును అందజేశారు. బీమాతో కుటుంబం ధీమాగా ఉంటుందన్నారు.

error: Content is protected !!