News January 30, 2025

కాకినాడ: పోలీసులు తమ నంబర్లు బహిర్గతం చేయాలి

image

కాకినాడ జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల ఎస్ హెచ్ ఓలు తమ ఫోన్ నంబర్లు అందరికీ తెలిసేలా బహిర్గతం చేయాలని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ సూచించారు .నెలవారి క్రైమ్ రివ్యూలో మాట్లాడిన ఎస్పీనంబర్లను జనసంచారం ఉండే ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు విద్యా వైద్య సంస్థల వద్ద ఉంచాలన్నారు. తద్వారా ప్రజలకు సమస్య వస్తే వెంటనే పోలీసులకు తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News January 9, 2026

అయోధ్యలో నాన్-వెజ్ ‌నిషేధం

image

అయోధ్య, పంచకోషీ యాత్ర రూట్లలో నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు UP ప్రభుత్వం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్లలో నాన్-వెజ్ పదార్థాల తయారీ, అమ్మకాలపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొంతమంది టూరిస్టులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని తింటున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ఆన్‌లైన్ డెలివరీలపైనా నిషేధం విధించింది.

News January 9, 2026

నిమ్మకాయల నివాసంలో మంత్రి నారాయణ కీలక భేటీ

image

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ శుక్రవారం మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నివాసంలో కీలక నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించిన ఆయన, ఆది నుంచి పార్టీ కోసం శ్రమించిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని స్థానిక రాజకీయ పరిణామాలను మంత్రికి వివరించారు.

News January 9, 2026

బాస్కెట్ బాల్ స్టేట్ కమిటీలో నిజామాబాద్ జిల్లా వాసి

image

తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లాకి చెందిన బొబ్బిలి నరేశ్ నియామకం అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొబ్బిలి నరేశ్ కుమార్‌కు ఈ అవకాశం రావడంతో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.