News February 12, 2026
కాకినాడ పోలీస్ శాఖకు ‘సీ పోర్ట్స్’ గిఫ్ట్.. రూ.12 లక్షల వాహనం బహూకరణ

కాకినాడ ‘సీ పోర్ట్స్’ లిమిటెడ్ (SPL) కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా పోలీస్ శాఖకు రూ.12 లక్షల విలువైన మహీంద్రా బొలెరో వాహనాన్ని బహూకరించింది. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్ వాహన తాళాలను అందుకుని, జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ యంత్రాంగానికి అండగా నిలిచిన సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
Similar News
News March 13, 2026
ఇంటర్ స్టూడెంట్ దారుణం.. ముగ్గురు బాలికలపై అత్యాచారం

TG: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి కామాంధుడిగా మారిన ఘటన నాగర్‌కర్నూల్(D) కొల్లాపూర్(M)లో జరిగింది. ప్రేమ పేరుతో ముగ్గురు తోటి విద్యార్థినులపై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. డబ్బు ఇవ్వకపోతే వాటిని పేరెంట్స్‌కు పంపుతానని, SMలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఓ బాలిక గర్భం దాల్చగా ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. ఓ విద్యార్థిని ఫిర్యాదుతో బాలుడితోపాటు ఇద్దరు వైద్యులు, నర్సును పోలీసులు అరెస్టు చేశారు.
News March 13, 2026
NLG: 62 పోస్టులు.. 16న ఇంటర్వ్యూలు

ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది కోసం ఈనెల 16న ప్రిన్సిపల్ ఛాంబర్‌లో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. మెడికల్ కళాశాలలో ఒక ప్రొఫెసర్, 15 అసోసియేట్ ప్రొఫెసర్స్, 32 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 14 మంది ట్యూటర్స్‌ను తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు రిక్రూట్ చేసుకోనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు.
News March 13, 2026
SEBI హోల్ టైమ్ మెంబర్‌గా తెలుగు వ్యక్తి!

స్టాక్ మార్కెట్లను పర్యవేక్షించే సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో తెలుగు వ్యక్తికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. SEBI హోల్ టైమ్ మెంబర్‌గా మాజీ IDAS అధికారి కేవీ రమణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా SEBIలో పార్ట్‌టైమ్ మెంబర్‌గా పనిచేశారు. సెబీ నిర్ణయాల్లో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు.


