News June 6, 2024

కాకినాడ: ప్రాణం తీసిన ఎన్నికల బెట్టింగ్

image

కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక అప్పయ్యచెరువు ప్రాంతానికి చెందిన బిక్కిన సురేశ్ (30) ఎన్నికల్లో బెట్టింగ్ వేసిన వారికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ క్రమంలో గెలిచిన వ్యక్తులు డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేశారు. దీంతో తండ్రి సాయిబాబుకు ఫోన్‌లో ‘డాడీ నేను తట్టుకోలేకపోతున్నాను..‘ఐ మిస్ యూ డాడీ’ అని వాయిస్ మెసేజ్ పెట్టి ఉరేసుకొని చనిపోయాడు. కేసు నమోదైంది.

Similar News

News November 28, 2025

పీఎంఏవై గ్రామీణ సర్వే పూర్తి: కలెక్టర్ కీర్తి

image

పీఎంఏవై గ్రామీణ 2.0 పథకం కింద ఇళ్లు లేని పేదల గుర్తింపు గడువు నవంబర్ 30 వరకు ఉండటంతో, జిల్లాలో 16,335 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. గృహనిర్మాణ శాఖ సిబ్బంది ద్వారా ‘ఆవాస్ ప్లస్’ యాప్‌లో సర్వే పూర్తి చేసినట్లు ఆమె ప్రకటించారు. అర్హత కలిగి, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News November 28, 2025

రాజానగరం: ధాన్యం కొనుగోళ్లపై జేసీ ఆరా

image

రాజానగరం మండలంలోని జి. ఎర్రంపాలెంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి పండించిన రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ శుక్రవారం స్వయంగా మాట్లాడారు. పంట దిగుబడి వివరాలను తెలుసుకున్న ఆయన.. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు తోలిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందా లేదా అని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News November 28, 2025

రాజమండ్రి: అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

image

అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, సమయపాలన కచ్చితంగా పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, రోజువారీ హాజరుపై ఆరా తీశారు. పేదలకు అందించే భోజనం ఎల్లప్పుడూ నాణ్యతగా ఉండేలా చూస్తూ, మెనూను తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు.