News June 6, 2024
కాకినాడ: ప్రాణం తీసిన ఎన్నికల బెట్టింగ్
కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక అప్పయ్యచెరువు ప్రాంతానికి చెందిన బిక్కిన సురేశ్ (30) ఎన్నికల్లో బెట్టింగ్ వేసిన వారికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ క్రమంలో గెలిచిన వ్యక్తులు డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేశారు. దీంతో తండ్రి సాయిబాబుకు ఫోన్‌లో ‘డాడీ నేను తట్టుకోలేకపోతున్నాను..‘ఐ మిస్ యూ డాడీ’ అని వాయిస్ మెసేజ్ పెట్టి ఉరేసుకొని చనిపోయాడు. కేసు నమోదైంది.
Similar News
News December 13, 2024
రాజమండ్రి: హోంగార్డుతో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
బొమ్మూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని గురువారం సస్పెండ్ చేశారు. SP నరసింహ కిషోర్ ఈ మేరకు అతనిపై చర్యలు తీసుకున్నారు. మద్యం మత్తులో హెచ్‌సీ విధి నిర్వహణలో ఉన్న మహిళా హోంగార్డుతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె భర్త ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
News December 13, 2024
రాజమండ్రి: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని 2020లో జరిగిన ఓ హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు విధించింది. రాజమండ్రి రూరల్ కొంతమూరుకు చెందిన కనకదుర్గను హత్య చేసిన కేసులో నరసింహరాజును ముద్దాయిగా కోర్టు నిర్ధారించింది. సాక్షుల విచారణ అనంతరం జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదుతోపాటు, రూ.2 వేలు జరిమానా విధించినట్లు కోర్టు తీర్పు వెల్లడించిందని పోలీసులు తెలిపారు.
News December 13, 2024
రైతులకు అండగా వైసీపీ పోరాటం: కన్నబాబు
రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వారి తరఫున అండగా ఉండి వైసీపీ పోరాడుతుందని మాజీ మంత్రి, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం కాకినాడలో రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపడుతున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.