News April 12, 2025
కాకినాడ: బావ.. నా రిజల్ట్ చూడు రా..!

కాకినాడ జిల్లాలో మొత్తం 44,531 మంది పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్లో 22,656 మంది, సెకండియర్‌లో 21,871 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్‌టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘బావ.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు. ☞ వే2న్యూస్ యాప్‌లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.
Similar News
News December 12, 2025
భారత్ భారీ స్కోర్

మెన్స్ U-19 ఆసియా కప్-2025లో భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. UAEతో మ్యాచులో 50 ఓవర్లలో 433-6 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 171 రన్స్‌తో ఊచకోత కోశారు. ఆరోన్ జార్జ్ 69, విహాన్ మల్హోత్రా 69 పరుగులతో అదరగొట్టారు.
News December 12, 2025
హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి: CBN

AP: అత్యంత హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందుతుందని CM CBN ఆకాంక్షించారు. తూర్పునావికాదళ కేంద్రంగా, టూరిజమ్ హబ్‌గా ఉన్న విశాఖ ఇప్పుడు ఐటీ, ఏఐ, టెక్నాలజీ, నాలెడ్జ్ సిటీగా మారుతోందని అభివర్ణించారు. కాగ్నిజెంట్ సహా 8 సంస్థలకు భూమి పూజచేశామని, ఏడాదిలో 25వేల మందికి అవకాశాలు వచ్చి ఇక్కడినుంచి పనిచేయగలుగుతారని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుందని, మెట్రో కూడా వస్తుందని చెప్పారు.
News December 12, 2025
విశాఖను మరో స్థాయికి తీసుకెళ్తాం: చంద్రబాబు

విశాఖ లాంటి బ్యూటిఫుల్ సిటీ దేశంలో ఎక్కడా లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలిగే అద్భుతమైన సిటీ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని మరోస్థాయికి తీసుకెళ్తామన్నారు. వచ్చే ఏడాదిలో 25 వేల మంది పనిచేసే సంస్థగా కాగ్నిజెంట్ మారుతుందని అన్నారు. నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి విశాఖ కేంద్రమవుతుందని చెప్పారు. త్వరలో భోగాపురం ఎయిర్ పోర్టు, విశాఖ మెట్రో వస్తుందని పేర్కొన్నారు.


