News April 12, 2025

కాకినాడ: బావ.. నా రిజల్ట్ చూడు రా..!

image

కాకినాడ జిల్లాలో మొత్తం 44,531 మంది పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్‌లో 22,656 మంది, సెకండియర్‌లో 21,871 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్‌టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘బావ.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు. ☞ వే2న్యూస్ యాప్‌లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.

Similar News

News April 20, 2026

డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీ హాస్టల్, కోచింగ్

image

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ BC గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 కాలేజీల్లో BSc, BCom, BBA లాంటి రెగ్యులర్ కోర్సులతో పాటు యానిమేషన్ వంటి స్పెషల్ కోర్సుల్లో 9,260 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు మే 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉచిత వసతితోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు.

News April 20, 2026

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్షలు.. 7757 విద్యార్థులు

image

జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ 10 ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. పదో తరగతికి 10 పరీక్ష కేంద్రాల్లో 2,692, ఇంటర్మీడియట్‌కు 18 కేంద్రాల్లో 5,065, మొత్తం 7,757 మంచి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

News April 20, 2026

జనగణన ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ?

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నిషేధాన్ని ఎత్తివేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలుపై CM రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. జనగణన విధులు ముగిశాకే రిలీవింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. రెండేళ్ల సర్వీస్ పూర్తికాని వారికి ఈసారి ఛాన్స్ లేదు. అలాగే స్పౌజ్ కేటగిరీ, దివ్యాంగులకు టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నారు.