News March 18, 2025
కాకినాడ: భర్త వేధింపులు.. కుటుంబాన్ని పోషించలేక సూసైడ్

కాకినాడలో నిన్న స్వాతి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ ఉన్న సూసైడ్ నోట్, సెల్ఫీవీడియో ద్వారా తెలిసింది. స్వాతి(26), సురేష్‌లది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు. సురేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. స్వాతి తెచ్చిన జీతం తీసుకొని తాగేసి గొడవ పడేవాడు. ఇలా అయితే పిల్లల భవిష్యత్తు ఏంటని ఆందోళన చెంది సూసైడ్ చేసుకుంది.
Similar News
News November 25, 2025
సూర్యాపేట: సర్పంచ్ రిజర్వేషన్లపై ఫిర్యాదు

పాలకీడు మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ఒక్క పంచాయతీకి కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదంటూ నక్క శ్రీనివాస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బీసీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లోనూ జనరల్ రిజర్వేషన్లు కేటాయించకపోవడం అన్యాయమని ఆరోపించారు. జీఓ 46 ప్రకారం రొటేషన్ విధానం పాటించలేదని ఆయన పేర్కొన్నారు.
News November 25, 2025
నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.
News November 25, 2025
రేపు హైదరాబాద్‌లో వాటర్ బంద్

నగరానికి తాగునీటిని అందించే కృష్ణ ఫేజ్-1, 2, 3లో పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లు, ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉ.10 గం. నుంచి సా.4 గం. వరకు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. చార్మినార్, వినయ్‌నగర్, భోజగుట్ట, రెడ్‌హిల్స్, నారాయణగూడ, ఎస్సార్ నగర్, హయత్‌నగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, మీర్పేట్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు.


