News December 20, 2024

కాకినాడ: భూముల మార్కెట్ విలువల సవరణకు చర్యలు

image

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కోనసీమ జిల్లాలో జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో భూముల మార్కెట్ విలువల సవరణకు చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఈ మేరకు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్లతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ విలువల సవరణకు సంబంధించిన అంశాలపై వారికి అవగాహన కల్పించారు

Similar News

News December 22, 2025

బీజేపీతోనే సుపరిపాలన సాధ్యం: MP పురందీశ్వరి

image

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని MP పురందీశ్వరి అన్నారు. అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా సోమవారం రాజమండ్రిలోని తన కార్యాలయం వద్ద ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా సుపరిపాలన అందుతోందని పేర్కొన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

News December 22, 2025

బీచ్ వాలీబాల్‌లో మెరిసిన తూ.గో కుర్రాళ్లు

image

బాపట్లలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో దుద్దుకూరుకు చెందిన మల్లిపూడి చందు, తాడిపూడికి చెందిన వేములూరు కార్తీక్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్థులు వీరిని ఘనంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తామని యువకులు ధీమా వ్యక్తం చేశారు.

News December 22, 2025

రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం PGRS నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.