News March 12, 2025

కాకినాడ: మంత్రి నాదెండ్లను కలిసిన కలెక్టర్ షాన్ మోహన్

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గత కొద్దిరోజులుగా కాకినాడలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పోర్టు నుంచి రవాణా అవుతున్న బియ్యం తరలిపోకుండా తీసుకుంటున్న చర్యలు కలెక్టర్ మంత్రికి వివరించారు. పీడీఎస్ బియ్యం విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆయనకు సూచించారు.

Similar News

News December 3, 2025

న్యూస్ రౌండప్

image

☞ కర్నూలు, నంద్యాల జిల్లాల టాప్ హెడ్‌లైన్స్
★ కర్నూలు-బళ్లారి రోడ్డును NHగా మార్చాలని కేంద్ర మంత్రికి TG భరత్ వినతి
★ RU పరిధిలో బీఈడీ ఫలితాలు విడుదల
★ సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై 925 మందిపై కేసులు
★ ఆలూరుకు కలెక్టర్ వస్తే సమాచారం ఇవ్వరా?: ఎమ్మెల్యే విరూపాక్షి
★ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో
★ కర్నూలు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం
★ శ్రీశైలంలో శివ స్వాముల రద్దీ

News December 3, 2025

అనకాపల్లి: ‘8,000 కుటుంబాలకు వంద రోజులు పని కల్పించాలి’

image

ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో డిసెంబర్ 13వ తేదీ నాటికి 8,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం అనకాపల్లి కలెక్టరేట్ అధికారులతో ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న మ్యాజిక్ డ్రెయిన్లు, కంపోస్ట్ పిట్స్, క్యాటిల్ షెడ్స్ పనులను వారం రోజులు లోగా పూర్తి చేయాలన్నారు. నీటి కుంటల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.

News December 3, 2025

BREAKING: సత్తుపల్లి వద్ద ఘోరం.. ముగ్గురు మృతి

image

సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. గృహప్రవేశ వేడుక కోసం చంద్రుగొండ నుంచి సత్తుపల్లికి వస్తుండగా, కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.