News February 4, 2025

కాకినాడ: మత్స్యకారులకు కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్

image

తొండంగి తీర సముద్రగర్భంలో దివిస్ సంస్థ డిసాలినేషన్ పైపులైన్ల పనులకు సహకరిస్తున్న మత్స్యకార సంఘాలు, కుటుంబాలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శణ్మోహన్, మత్స్యకార సంఘ ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివిస్ సంస్థ పారిశ్రామిక అవసరాల కోసం ఉప్పు నీటిని మంచినీరుగా మార్చిందన్నారు.

Similar News

News March 15, 2026

పుట్టపర్తిలో అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 4,923 వ్యక్తిగత మరుగుదొడ్లలో 3,725 పనులు పూర్తయ్యాయని, మిగిలినవాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు రూ.299.37 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.

News March 15, 2026

ఈనెల 15 నుంచి పశువులకు గాలికుంటు టీకాలు: కలెక్టర్

image

పెదమిరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార గోడపత్రికను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆమె తెలిపారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.

News March 15, 2026

నన్ను డ్రగ్స్ కేసులోకి లాగితే లీగల్ యాక్షన్ తప్పదు: KTR

image

TG: ప్రతీ డ్రగ్స్ కేసులోకి తనని లాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని KTR హెచ్చరించారు. ఎలాంటి టెస్ట్‌కైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతీసారి BRS పార్టీని లాగడం దారుణమన్నారు. తాను, తమ పార్టీ డ్రగ్స్ వాడకానికి పూర్తి వ్యతిరేకమన్నారు. BRS Ex MLA పైలట్ <<19386182>>రోహిత్ రెడ్డి<<>> డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నేపథ్యంలో KTR వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.