News August 6, 2024

కాకినాడ: మహిళా ఇంజినీరింగ్ అసిస్టెంట్ మిస్సింగ్

image

తొండంగి మండలంలో ఓ మహిళా ఇంజినీరింగ్ అసిస్టెంట్ అదృశ్యమైంది. పోలీసుల వివరాలు.. ఉప్పాడ మండలం అమరవిల్లికి చెందిన లలిత ఐదేళ్లుగా GMపేట సచివాలయంలో ఇంజినీర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. శనివారం విధులకు హాజరై సాయంత్రం ఆటోలో ఇంటికి బయలుదేరింది. రాత్రి 7:40 గంటలకు కాకినాడ పోర్ట్ ప్రాంతంలో ఆమె సిగ్నల్ కట్ అయింది. అంతకుముందు ఆమె అన్నయ్యకు చనిపోతున్నానని మెసేజ్ చేసిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదైంది.

Similar News

News September 9, 2024

1400 కొత్త బస్సు సర్వీసులు: మంత్రి

image

ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు రాష్ట్రంలో కొత్తగా 1400 బస్సులను కొనుగోలు చేసి సర్వీసులను ప్రారంభించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు.

News September 8, 2024

రేపు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఉదయం 8:30 గంటలకు మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 9:45కి రాజమండ్రి చేరుకుంటారు. 9:50కి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి కాకినాడ కలెక్టరేట్‌కు.. 11:20కి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షలో పాల్గొంటారన్నారు.

News September 8, 2024

కాకినాడ జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

కాకినాడ జిల్లాలో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్క పాఠశాల నిర్వహించకూడదని, విధిగా సెలవు అమలు చేయాలన్నారు.