News March 26, 2025
కాకినాడ : మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు

మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై కాకినాడ టౌన్ -1 సీఐ నాగ దుర్గారావు కేసు నమోదు చేశారు. పెద్దాపురానికి చెందిన ఓ యువతి కాకినాడ ఘాటీసెంటర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడి మేనేజర్ సత్యమణికంఠ తనను తరచూ వేధిస్తున్నాడని ఆమె కంపెనీ ప్రతినిధులకు చెప్పినా ఫలితం లేదని వాపోయింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా.. మంగళవారం కేసు నమోదు చేశారు.
Similar News
News October 20, 2025
జుట్టు పెరగాలంటే హెయిర్ కట్ తప్పనిసరా?

జుట్టును కొద్దిగా కత్తిరించుకుంటే వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ జుట్టు పెరగడానికి హెయిర్‌కట్‌కి సంబంధం లేదంటున్నారు నిపుణులు. కానీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చివర్లు కత్తిరించడం మంచిదని సూచిస్తున్నారు. స్ప్లిట్ ఎండ్స్ వల్ల జుట్టు నిర్జీవంగా, గడ్డిలా తయారవుతుంది. కాబట్టి 3-4 నెలలకోసారి చివర్లు కత్తిరిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. <<-se>>#Haircare<<>>
News October 20, 2025
అరటిలో మాంగనీసు ధాతు లోపం – నివారణ

అరటి తోటలో మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. మాంగనీసు ధాతులోపం తీవ్రమైతే ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో తెల్లగా మారి లోపం తీవ్రమైనప్పుడు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.
News October 20, 2025
కొయ్యూరు: 3 సార్లు జెడ్పీటీసీ.. ఒకసారి జెడ్పీ వైస్ చైర్మన్

కొయ్యూరు మండల జెడ్పీటీసీ వారా నూకరాజు సోమవారం రోలుగుంట మండలంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. చిట్టెంపాడుకు చెందిన నూకరాజు ఒకసారి సీపీఐ తరపున, రెండుసార్లు వైసీపీ తరపున జెడ్పీటీసీగా గెలిచారు. 2001-06 మధ్యలో విశాఖ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గానూ పనిచేశారు. ఆయనకు కొంతకాలంగా ఛటర్జీపురం గ్రామానికి చెందిన భూముల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి చంపేశారు.