News March 9, 2025
కాకినాడ: మహిళా రైడర్లతో బైక్ నడిపిన మంత్రి

నిత్యం హడావిడి జీవితం. బుల్లెట్ ప్రూఫ్ వాహనం, చుట్టూ గన్మెన్లు, మందీ మార్బలంతో ఉండే పురపాలక మంత్రి పొంగూరి నారాయణ శనివారం కాకినాడలో తన ముచ్చట తీర్చుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని నడిపేందుకు సరదా పడ్డారు. మంత్రి వాహనం నడుపుతుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనను చూస్తూ ఉండిపోయారు. ఆయన కొద్ది దూరం పాటు వాహనాన్ని నడిపారు. అంతకుముందు మహిళా రైడర్లతో కలిసి ర్యాపిడో వాహనంపై ప్రయాణించారు.
Similar News
News November 21, 2025
వేములవాడ బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన 50 మంది

వేములవాడ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు, వేములవాడ ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సరిపల్లి కార్తీక్, లిక్కి జితేందర్ ఆధ్వర్యంలో వారి మిత్రబృందం మొత్తం 50 మంది శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
News November 21, 2025
నిరంతర తనిఖీలు చేయాలి: మంత్రి

రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలు మరింత కఠినతరం చేసేలా ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలని సూచించారు.
News November 21, 2025
బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశించారు. 6 నుంచి 14, 15 నుంచి 19 ఏళ్ల బడి బయటి పిల్లల వివరాలను ప్రబంధ్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, టెక్స్టైల్ పార్కుల్లో పనిచేసే కుటుంబాల పిల్లలకు పని ప్రదేశంలోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


