News July 16, 2024
కాకినాడ: మాజీ సిపాయి మృతి

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామానికి చెందిన మాజీ సిపాయి సబ్బతి భీమరాజు (94) మృతిచెందారు. కాకినాడలోని స్థానిక కచ్చేరిపేటలో మనుమరాలు నివాసంలో ఉంటూ సోమవారం తుదిశ్వాస విడిచారు. భీమరాజు సైన్యంలో బెటాలియన్ హవల్దార్ మేజర్గా పనిచేశారు. గతంలో పాకిస్థాన్, చైనా యుద్ధాల్లోనూ పాల్గొన్నారు. కాగా ఆయనకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.
Similar News
News October 30, 2025
నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు: DEO

జిల్లాలో తుఫాన్ ప్రభావం తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని DEO కె. వాసుదేవరావు ప్రకటించారు. తుఫాను పునరావాస కేంద్రాల కోసం వినియోగించిన పాఠశాలలను సిబ్బందిచే పరిశుభ్రంగా ఉంచాలని, పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న భవనాల వద్దకు విద్యార్థులు వెళ్లకుండా స్కూల్ హెచ్ఎంలు జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్థులకు హాట్ వాటర్ అందించాలని DEO సూచించారు.
News October 30, 2025
రద్దు చేసిన బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం: డీపీటీవో

తుఫాన్ నేపథ్యంలో తూ.గో జిల్లాలో రద్దు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీస్లను పునరుద్ధరించినట్లు DPTO వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. అటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా.. ఇటు ఆర్టీసీ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బస్సు సర్వీసులను రద్దు చేశామన్నారు. తుఫాను తీరం దాటడంతో జిల్లాలో నడుస్తున్న 219 సర్వీస్లు గురువారం నుంచి పూర్తిస్థాయిలో నడవనున్నట్లు డీపీటీవో వెల్లడించారు.
News October 30, 2025
ధవళేశ్వరం: 94 వేల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల

మొంథా తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. దీంతో బుధవారం సాయంత్రం 94,122 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ముందస్తు చర్యలో భాగంగా, తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు.


