News August 20, 2024
కాకినాడ: మాజీ MLA ద్వారంపూడి బహిరంగ లేఖ

రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై మాజీ MLA ద్వారంపూడిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కాకినాడ MLA కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు. కక్షసాధింపు చర్యలు, నిరాధార ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. తనను లక్ష్యంగా చేసుకొని పెడుతున్న కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
Similar News
News December 21, 2025
రాజమండ్రిలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

వీకెండ్ వచ్చిందంటే మాంస ప్రియులకు పండుగే. రాజమహేంద్రవరం మార్కెట్లో కేజీ స్కిన్ లెస్ ధర రూ.260, స్కిన్ తో కేజీ చికెన్ ధర రూ.240కు అమ్మకాలు జరుగుతున్నాయి. లైవ్ కోడి రూ.135-150కి లభ్యమవుతోంది. ఇదిలా ఉండగా కేజీ మటన్ ధర రూ.900 నుంచి వెయ్యి రూపాయల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆయా ఏరియాల బట్టి మార్కెట్లో చికెన్, మటన్ రేట్లు స్వల్ప తేడాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 21, 2025
లోకేశ్ పర్యటన అంతా ఆర్భాటమే: మార్గాని

మంత్రి లోకేశ్ రాజమండ్రి పర్యటన కేవలం ఆర్భాటం తప్ప మరేమీ లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ శనివారం విమర్శించారు. పర్యటన సాగిన ప్రతిచోటా వైసీపీ మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆసుపత్రిలో బాలింత మృతి, బాలికపై అత్యాచారం వంటి దారుణ ఘటనలపై మంత్రి స్పందించకపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల వైఫల్యాన్ని వదిలి లోకేశ్ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.