News August 20, 2024

కాకినాడ: మాజీ MLA ద్వారంపూడి బహిరంగ లేఖ

image

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై మాజీ MLA ద్వారంపూడిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కాకినాడ MLA కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు. కక్షసాధింపు చర్యలు, నిరాధార ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. తనను లక్ష్యంగా చేసుకొని పెడుతున్న కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

Similar News

News September 10, 2024

ఉమ్మడి తూ.గో.లో విజృంభిస్తున్న విష జ్వరాలు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 162 PHCలు, 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నిత్యం సగటున 2వేల వరకు సీజనల్ జ్వరాల కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. వీటికి తోడు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. గత నెలలో 50 వేల కేసులు, ఈ నెలలో ఇప్పటివరకు 13వేల కేసులు నమోదయ్యాయి.

News September 10, 2024

తూ.గో., కోనసీమ కలెక్టర్లతో మాట్లాడిన సీఎం

image

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై తూ.గో., కోనసీమ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. భారీ వర్షాలు, వరద పరిస్థితుల దృష్ట్యా ముంపు సమస్యపై నష్టతీవ్రతపై అంచనాను బుధవారం సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు. వీధుల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగాలని, ఇవాళ సాయంత్రానికి సరకుల పంపిణీని కూడా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

News September 10, 2024

తూ.గో.లో పంట కాలువల ఆక్రమణలు

image

భారీ వర్షాల నేపథ్యంలో పంటలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు పంట కాలువలు కీలకం. అయితే ఉమ్మడి తూ.గో.లో కాల్వలను పలువురు కబ్జా చేయడంతో ముంపు సమస్య ఏర్పడింది. ఖరీఫ్, రబీ సీజన్లలో 9.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా కాకినాడలో 54, రామచంద్రపురం 30, అమలాపురం 213, రాజోలు 632 కాలువలను కబ్జా చేసినట్లు అధికారుల లెక్కల్లో తేలింది. వెరసి వేలాది ఎకరాల్లో పంటలు ముంపుబారిన పడి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.