News March 12, 2025
కాకినాడ: మార్చి 31 లోగా పార్టీలు సలహాలు అందించాలి

ఎన్నికల ప్రక్రియలను మరింత బలోపేతం చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అవసరమైన సలహాలు, సూచనలు మార్చి31 నాటికి అందజేయాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలో నూతన సంస్కరణలు తీసుకొచ్చే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి అవసరమైన సూచనలు సలహాలను ఆహ్వానించిందన్నారు.
Similar News
News November 22, 2025
NMMS-2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో

జిల్లాలో రేపు జరగనున్న NMMS-2025 స్కాలర్షిప్ పరీక్షకు 1474 మంది 8వ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారని జిల్లా విద్యాధికారి కె.రాము తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రాలకు చేరాలని సూచించారు. జగిత్యాలలో 3, కోరుట్లలో 2, మెట్పల్లిలో 1 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 22, 2025
మంచిర్యాల: త్వరలో వాట్సాప్ నంబర్ ఏర్పాటు

సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని సీ అండ్ ఎంబీ బలరామ్ తెలిపారు. కంపెనీ వ్యాప్తంగా దాదాపు అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారన్నారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి వీలుగా త్వరలో ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
News November 22, 2025
కోరుట్ల: మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

కోరుట్ల పట్టణానికి చెందిన సాంబారు అభిరామ్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చిరంజీవి శనివారం తెలిపారు. గతంలో మృతుని తండ్రి శ్యాంసుందర్ గంగలో మునిగి మృతి చెందగా నాటి నుండి తన తండ్రిని తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడన్నారు. తండ్రి మృతితో అభిరామ్ మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


