News February 17, 2025
కాకినాడ: మున్సిపల్ ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా: కలెక్టర్

తుని మున్సిపల్ ఉపాధ్యక్ష ఎన్నికకు కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుని పురపాలక ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహణకు డీపీవో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను ఎన్నిక పరిశీలకుడిగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఉదయం జరిగిన సమావేశానికి కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేసినట్లు వివరించారు.
Similar News
News December 10, 2025
సమర్థవంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

మొదటి విడత ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కరీంనగర్ రూరల్, కొత్తపల్లి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి ఎన్నికల సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరించాలని జోనల్, రూట్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 10, 2025
MNCL: నవోదయ పరీక్షా కేంద్రాలు ఇవే.!

ఈ నెల 13న జరగనున్న JNV ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు జిల్లాలో 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
* ట్రినిటీ హై స్కూల్, ZPHS (బాలికలు) – లక్షెట్టిపేట
* కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్, ZPHS (బాలికలు మార్కెట్ రోడ్డు)- మంచిర్యాల
* ప్రభుత్వ ఉన్నత పాఠశాల- చెన్నూర్
* తెలంగాణ మోడల్ స్కూల్- మందమర్రి
* సెయింట్ మేరీ హైస్కూల్- బెల్లంపల్లి
* పరీక్ష టైం ఉ.11.30 కాగా విద్యార్థులు ఉ.10గంటలకు హాజరుకావాలి.
News December 10, 2025
నల్లగొండ: సోషల్ మీడియాలో ప్రచారం జోరు..!

పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ అభ్యర్థులు సోషల్ మీడియాలో మరింత జోరుగా ప్రచారం చేస్తూ తమ అభివృద్ధి కార్యక్రమాలు, సేవలు, భవిష్యత్ ప్రణాళికలను వీడియోలు, రీల్స్, పోస్టుల రూపంలో ఓటర్ల ముందుకు తీసుకువెళ్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రచార సందేశాలు వేగంగా విస్తరిస్తుండటంతో గ్రామ రాజకీయాలు ఆన్లైన్లో కూడా హాట్‌టాపిక్‌గా మారాయి.


