News February 17, 2025
కాకినాడ: మున్సిపల్ ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా: కలెక్టర్

తుని మున్సిపల్ ఉపాధ్యక్ష ఎన్నికకు కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుని పురపాలక ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహణకు డీపీవో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను ఎన్నిక పరిశీలకుడిగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఉదయం జరిగిన సమావేశానికి కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేసినట్లు వివరించారు.
Similar News
News March 26, 2025
ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు విడుదల

AP: ఉగాది వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు రిలీజ్ చేసింది. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. దీని కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించింది.
News March 26, 2025
జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్

జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈరోజు సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు. మున్సిపల్ పట్టణాలు మండల కేంద్రాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వాహనాలు పత్రాలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
News March 26, 2025
వాట్సాప్, గూగుల్ మ్యాప్స్‌తో దొంగడబ్బు కనిపెట్టిన Income Tax

ఎగవేతదారులు, బినామీలు, దాచిన డబ్బు, క్రిప్టో అసెట్స్‌ను గుర్తించడానికి Income Tax సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. వాట్సాప్, ఇన్‌స్టా, గూగుల్ మ్యాప్స్‌ను విశ్లేషించి వాటిని కనిపెట్టేస్తోంది. ఎగవేసిన ₹200CRను WA ఎన్‌క్రిప్టెడ్ మెసేజుల ఆధారంగా గుర్తించిన వైనాన్ని పార్లమెంటులో FM నిర్మల వివరించారు. G Maps ద్వారా డబ్బు దాచిన చోటు, Insta ద్వారా బినామీ ప్రాపర్టీ ఓనర్‌షిప్‌ను కనిపెట్టామని తెలిపారు.