News November 11, 2024

కాకినాడ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. యాజమాన్యం సీరియస్

image

కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. మద్యం తాగి జగదీశ్ అనే సీనియర్ విద్యార్థి పది మంది జూనియర్లను కారిడార్‌లోకి తీసుకొచ్చి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో వారు తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన యాజమాన్యం హౌస్ సర్జన్ జగదీశ్ ను ఏడాది పాటు సస్పెండ్ చేసి, రూ. 25 వేలు అపరాధ రుసుం విధించింది.

Similar News

News December 21, 2025

రాజమండ్రిలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

వీకెండ్ వచ్చిందంటే మాంస ప్రియులకు పండుగే. రాజమహేంద్రవరం మార్కెట్లో కేజీ స్కిన్ లెస్ ధర రూ.260, స్కిన్ తో కేజీ చికెన్ ధర రూ.240కు అమ్మకాలు జరుగుతున్నాయి. లైవ్ కోడి రూ.135-150కి లభ్యమవుతోంది. ఇదిలా ఉండగా కేజీ మటన్ ధర రూ.900 నుంచి వెయ్యి రూపాయల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆయా ఏరియాల బట్టి మార్కెట్లో చికెన్, మటన్ రేట్లు స్వల్ప తేడాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 21, 2025

లోకేశ్ పర్యటన అంతా ఆర్భాటమే: మార్గాని

image

మంత్రి లోకేశ్ రాజమండ్రి పర్యటన కేవలం ఆర్భాటం తప్ప మరేమీ లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ శనివారం విమర్శించారు. పర్యటన సాగిన ప్రతిచోటా వైసీపీ మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆసుపత్రిలో బాలింత మృతి, బాలికపై అత్యాచారం వంటి దారుణ ఘటనలపై మంత్రి స్పందించకపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల వైఫల్యాన్ని వదిలి లోకేశ్ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.