News December 2, 2024

కాకినాడ: రేపు యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ

image

కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి కలెక్టరేట్ వద్ద, జిల్లాలోని అన్ని మండల స్థాయి, డివిజన్ స్థాయి కార్యాలయాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో అందిస్తే పరిష్కరమిస్తామన్నారు

Similar News

News February 9, 2025

RJY: సంగీతా నృత్య పాఠశాలను సందర్శించిన మంత్రి

image

రాజమండ్రిలోని విజయశంకర్ ప్రభుత్వ సంగీతా నృత్యపాఠశాలను శనివారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక ,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినీవిద్యార్థులతో మాట్లాడారు. సంగీత నృత్య పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక శాఖ కమీషన్‌ ఛైర్‌పర్సన్‌ పొడపాటి తేజస్విని పాల్గొన్నారు.

News February 8, 2025

తూ.గో: వైసీపీలోకి ఉండవల్లి! సోషల్ మీడియాలో ప్రచారం

image

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం నెట్టింట జోరందుకుంది. ఈ నెల 26న ఆయన వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని వైసీపీ శ్రేణులు నెట్టింట పోస్టులు పెడుతున్నాయి. ఈ ప్రచారంపై ఉండవల్లి స్పందించాల్సి ఉంది. కాగా ఉండవల్లికి వైఎస్ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.

News February 8, 2025

అనపర్తి MLA కుమారుడి పెళ్లికి హాజరైన CM

image

హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ హల్‌లో అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్- సుమేఘరెడ్డిల వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. అనంతరం MLAతో కాసేపు ముచ్చటించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

error: Content is protected !!