News March 28, 2024

కాకినాడ: రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

image

కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్లిపాడు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృత్యువాత పడినట్లు ఎస్సై అబ్దుల్ మారూప్ తెలిపారు. మృతుడు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు నుంచి జారిపడి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉంచామని పోలీసులు తెలిపారు.

Similar News

News January 24, 2025

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం

image

రాజమండ్రి ఎయిర్‌‌పోర్ట్‌లో శుక్రవారం ప్రమాదం జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. స్థానికంగా కొత్త టెర్మినల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో క్రేన్ వైర్ తెగిపడటంతో నిర్మాణంలో ఉన్న కొంత భాగం కూలిపోయింది. ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News January 24, 2025

అయినవిల్లి: యువతి కిడ్నాప్.. కేసు నమోదు 

image

అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన పదహారేళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన దింపు కార్మికుడు సాయి బుధవారం రాత్రి తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ యువతి తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దింపులు తీసేందుకు వచ్చిన సాయి స్థానికంగా ఉంటూ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.

News January 24, 2025

అమలాపురం: హారన్ కొట్టాడని యువకుడిపై దాడి.. ముగ్గురి అరెస్టు

image

హారన్ కొట్టాడన్న కారణంతో యువకుడిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశామని అమలాపురం టౌన్ సీఐ వీరబాబు తెలిపారు. ఈ కేసులో నిందితులు ఆనందరావు, సురేశ్, సత్యనారాయణను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించిందన్నారు. వారిని కొత్తపేట సబ్ జైలుకు తరలించామన్నారు. సవరప్పాలానికి చెందిన యువకుడు దుర్గాప్రసాద్‌పై ఈదరపల్లి వంతెన వద్ద యువకులు దాడికి పాల్పడ్డారన్నారు.