News August 16, 2024
కాకినాడ: రోడ్డు ప్రమాదంలో ANM మృతి
కాకినాడ జిల్లా సామర్లకోట ఏడీబీ రహదారిలో స్కూటీపై వెళుతున్న ఓ మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన మహిళ చికిత్స పొందుతూ సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం మృతి చెందింది. సదరు మహిళ సామర్లకోట మండలంలోని ఉండూరు గ్రామానికి చెందిన ANM నాగ సత్యవేణిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 19, 2024
తూ.గో.: ఐటీఐలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
పదో తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఉమ్మడి జిల్లాలోని ఐటీఐలో ప్రవేశం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగులు సీట్ల భర్తీకి నాలుగో విడత అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని రాజమండ్రి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రాధా రామకృష్ణన్ బుధవారం కోరారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో వెబ్‌సైట్ ద్వారా 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు.
News September 18, 2024
తూ.గో.: చిరుత కోసం అదనపు బోన్లు ఏర్పాటు
సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలలో బుధవారం చిరుత కదలికలు గుర్తించలేదని అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ట్రాప్ కెమెరాలను మారుస్తూ అదనపు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులలో కుక్కలు చిక్కుకుంటున్నాయని, దాని వల్ల ఇబ్బంది కలుగుతుందన్నారు. నివాస ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ కాలేదని, దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోనే చిరుత ఉందన్నారు.
News September 18, 2024
అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు
అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆలయానికి చెందిన కె.కొండలరావు, ఐ.వి.రామారావు, జె.శ్రీనివాస్ లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.