News October 25, 2024
కాకినాడ: లవర్ చనిపోవాలని విషం కొనిచ్చిన ప్రియుడు UPDATE

కాకినాడ యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యు.కొత్తపల్లికి చెందిన ప్రియుడు ఉమామహేశ్వరరావు ఆన్ లైన్ పేమెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రేమ పేరుతో మోసం చేసి వేరొకరిని నిశ్చితార్థం చేసుకోగా.. విషయం తెలుసుకున్న ప్రియురాలు తనని పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని బెదిరించింది. యువతిని అడ్డుతొలగించుకోవాలని విషం ఎక్కడ దొరుకుతుందో సలహా ఇచ్చి, రూ.270 ఫోన్ పే చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
Similar News
News November 22, 2025
“తూర్పు”లో టెన్త్ రాయనున్న 26,619 విద్యార్థులు

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 26,619 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి విజయం సాధించాలని డీఈఓ సూచించారు.
News November 22, 2025
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు: శశాకం

సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు అర్హత పొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు బి. శశాంక తెలిపారు. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 25లోగా స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. డిసెంబర్ 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.