News March 21, 2025

కాకినాడ-లింగంపల్లి మధ్య రెండు స్పెషల్ రైళ్లు

image

కాకినాడ- లింగంపల్లి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. లింగంపల్లి నుంచి కాకినాడకు ఏప్రిల్ 3 నుంచి జులై 1వరకు మంగళ, గురు, శనివారాల్లో నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News April 2, 2025

వికారాబాద్: సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన స్పీకర్

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పాత గంజిలో డీలర్ గోపాల్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ నాయక్, ఆర్డిఓ వాసు చంద్ర, మున్సిపల్ మాజీ ఛైర్మన్ సత్యనారాయణ, తహశీల్దార్ పాల్గొన్నారు.

News April 2, 2025

కోర్టు సినిమా హీరోను అభినందించిన ఎమ్మెల్యే

image

భద్రాచలం విచ్చేసిన కోర్టు మూవీ హీరో రోషన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. చిన్న వయసులో సినిమా రంగంలోకి ప్రవేశించి కోర్టు మూవీ ద్వారా పెద్ద హిట్ కొట్టినందుకు అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సినిమా రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భద్రాచలం పట్టణాన్ని పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు.

News April 2, 2025

విజయవాడలో రూ.252 కోట్ల పన్ను వసూలు

image

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.252 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు బుధవారం వీఎంసీ వెల్లడించింది. నగరపాలక సంస్థకు గతంలో ఎన్నడూ లేనంతగా పన్నులు వసూలైనట్లు మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అనంతరం వీఎంసీ రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ సత్యవతిని మేయర్ అభినందించారు.

error: Content is protected !!