News September 29, 2024
కాకినాడ వాసి ఫిర్యాదు.. యాపిల్ సంస్థకు రూ.లక్ష ఫైన్

ప్రముఖ మొబైల్ సంస్థ ‘యాపిల్’కు కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష ఫైన్ విధించింది. కాకినాడలోని సూర్యారావుపేటకు చెందిన పద్మరాజు 2021 OCT 13న రూ.85,800లకు యాపిల్ ఫోన్ కొన్నారు. ఫోన్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ అని ప్రకటించిన సంస్థ.. తనకు ఫోన్ పంపి, ఇయర్ పాడ్స్ ఇవ్వలేదని పద్మరాజు పలుమార్లు కస్టమర్ కేర్కు ఫోన్ చేశారు. స్పందన లేకపోవడంతో ఆయన 2022లో కమిషన్ను ఆశ్రయించగా.. శనివారం తీర్పు వెలువడింది.
Similar News
News December 10, 2025
రాజమండ్రిలో ఈనెల 12న జామ్ మేళా!

రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని ఆమె సూచించారు.
News December 10, 2025
రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఉనగట్ల విద్యార్థులు ఎంపిక

చాగల్లు మండలం ఉనగట్ల జడ్పీ హైస్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల చిట్యాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14 విభాగంలో ఈ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారని హెచ్ఎం ఎన్.వీ. రమణ తెలిపారు. పంతగాని లాస్య, కంచర్ల హనీ చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.
News December 10, 2025
తూ.గో: గ్రామీణ రహదారుల మరమ్మతులకు భారీగా నిధులు

గ్రామీణ రహదారుల మరమ్మతులు, నిర్మాణాల కోసం ఏపీఆర్ఎస్పీ పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఏకంగా రూ.363.33 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 57 పనులకు రూ.72.39 కోట్లు, కోనసీమ జిల్లాలో 78 పనులకు రూ.130.79 కోట్లు, కాకినాడ జిల్లాలో 106 పనులకు రూ.160.15 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు.


